NRPT: డిసెంబర్ 31 పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో బాంబు డిస్పోజల్ బృందాలు, జాగిలాలతో తనిఖీలు చేసినట్లు SI వెంకటేశ్వర్లు తెలిపారు. బస్టాండ్, ప్రధాన కూడళ్లు, కొరియర్ దుకాణాలు, లాడ్జి, పాన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లలో తనిఖీలు చేశారని చెప్పారు. కొత్త సంవత్సరం వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.