ADB: మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కేసు నమోదు చేస్తామని నార్నూర్ సీఐ అంజమ్మ హెచ్చరించారు. ఆమె బుధవారం మండల కేంద్రంలోని విజయనగర్ కాలనీ సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపినా, రాష్ డ్రైవింగ్, రేసింగ్, మైనర్ డ్రైవింగ్ చేస్తే వాహనం సీజ్ చేసి జరిమానా విధిస్తామన్నారు.