MBNR: న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో 108 అంబులెన్స్ మెడికల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవికుమార్ తెలిపారు. DEC 31ST రాత్రి యువత ఉత్సాహంతో వాహనాలను వేగంగా నడిపే క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అత్యవసర పరిస్థితుల్లో 108 సిబ్బంది తక్షణమే స్పందించేలా సిద్ధంగా ఉండాలని అన్నారు.