విశాఖలో నూతన సంవత్సర వేడుకల కోసం పోలీస్ కమిషనర్ కఠిన మార్గదర్శకాలు జారీ చేశారు. వేడుకలకు ముందస్తు అనుమతి తప్పనిసరని, ఈవెంట్లలో అశ్లీలత, మాదకద్రవ్యాలకు తావులేదని స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు, 45 డెసిబెల్స్ లోపు శబ్దం, మైనర్లకు నో ఎంట్రీ వంటి నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. డ్రగ్స్ కనిపిస్తే 7995095799 ఫిర్యాదు చేయాలన్నారు.