SKLM: హిరమండలం మండలం తంప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే గోవిందరావు ఇవాళ పరిశీలించారు. ఈ మేరకు పాఠశాల మౌలిక వసతులు, విద్యార్థులకు అవసరమైన సదుపాయాలపై ఉపాధ్యాయులతో వివరంగా చర్చించారు. విద్య సమాజ భవిష్యత్తుకు పునాది అని అన్నారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుని విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పిస్తామని అన్నారు.