TG: హైదరాబాద్ గాజులరామారంలోని పేదల ఇళ్లకు హైడ్రా భరోసా ఇచ్చింది. గాజులరామారంలోని సర్వే నం.307లో హైడ్రా కమిషనర్ పర్యటించారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న పేదలతో మాట్లాడారు. సర్వే నం.307లోని పేదల ఇళ్లు మినహాయిస్తున్నట్లు రంగనాథ్ వెల్లడించారు. కొత్త ఇళ్లు నిర్మించకుండా చూడాలని అధికారులకు సూచించారు.