అన్నమయ్య: ప్రజల ఆకాంక్షల మేరకు మదనపల్లి కేంద్రంగా ఏర్పాటైన నూతన అన్నమయ్య జిల్లా అన్ని రకాల అభివృద్ధికి దారితీస్తుందని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించి, పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.