ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ అధినేత ఎలాన్ మస్క్.. కంటెంట్ క్రియేటర్లకు ఇచ్చే మెుత్తాన్ని భారీగా పెంచనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 31న జరిగిన ఒక ఆసక్తికర చర్చలో.. ప్లాట్ఫామ్లో క్వాలిటీ ఒరిజినల్ కంటెంట్‌ను నిలుపుకోవడానికి క్రియేటర్ల పేఅవుట్స్ను గణనీయంగా పెంచాలన్న ప్రతిపాదనకు మస్క్ సానుకూలంగా స్పందించారు.