Saripodhaa Sanivaaram: Nani Supada Special Video from Saturday!
Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సరిపోదా శనివారం. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎస్‌జె సూర్య విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే మూవీ టీం తాజాగా మరో స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఈరోజు శనివారం, అందులోనూ ఎస్‌జె సూర్య పుట్టినరోజు కావడంతో ఆయనకు బర్త్ డే విషెష్ తెలుపుతూ మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఇది టీజర్ కాదు అంటూ విడుదల చేశారు. ఈ వీడియోతో ఇంకా అంచనాలు పెరుగుతున్నాయి.
ఇది కూడా చూడండి: KTR: నారాయణమూర్తిని ఫోన్లో పరామర్శించిన కేటీఆర్
పురాణాల్లో నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టేవాడు. అందుకే శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అంటూ నాని హీందీలో చెప్పే వాయిస్ ఓవర్‌తో వీడియో ప్రారంభమైంది. రావణాసురుడుగా, ప్రజలను హింసించే క్రూరమైన పోలీసాఫీసర్ గా ఎస్ జె సూర్యను పరిచయం చేసారు. అతన్ని ఎదుర్కోవడానికి శ్రీకృష్ణుడు (నాని) తన సత్యభామ (ప్రియాంక మోహన్)తో కలిసి వస్తున్నట్లుగా ఈ వీడియోలో చూపించారు. ఇక చివర్లో నాని రౌడీలను కొట్టిపడేసి, ‘హ్యాపీ బర్త్ డే సార్’ అని చెప్పడంతో ఈ వీడియో ముగిసింది. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్నా ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది కూడా చూడండి: Samantha : మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న సమంత!

