అన్నమయ్య: వాట్సాప్ ద్వారా ప్రజలకు అందించే సేవలపై విస్తృత అవగాహన కల్పించాలని, ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, పనులను త్వరితగతిన నాణ్యతతో అమలు చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో భూసేకరణ, పట్టాదారు పాసు పుస్తకాలు, పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారం, స్వామిత్వ పనుల పురోగతిపై సమీక్షించారు.

