GNTR: జిల్లా పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడిగా మంగళగిరికి చెందిన వెంకట సాంబశివరావు నియమితులయ్యారు. AP పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని, జిల్లా వ్యాప్తంగా పద్మశాలి సోదరులను ఏకం చేసి సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానని సాంబశివరావు ధీమా వ్యక్తం చేశారు.

