అన్నమయ్య: రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో సోమవారం పల్లకి సేవ ఘనంగా జరిగింది. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల భక్తులతో పాటు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో డివి రమణారెడ్డి పర్యవేక్షించారు.

