అన్నమయ్య: మదనపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను సకాలంలో, నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీలపై పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని, అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

