»How Is The First Single From Nani Saripoda Shanivaram
Saripoda Shanivaram: గరం.. గరంగా హీరో నాని!
ఈసారి న్యాచురల్ స్టార్ నాని కాస్త గరం గరంగా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. అయితే.. సినిమా రిలీజ్ కంటే ముందే.. గరం గరం అని అంటున్నాడు నాని. మరి సరిపోదా శనివారం నుంచి వస్తున్న ఫస్ట్ సింగిల్ ఎలా ఉండబోతోంది?
How is the first single from Nani Saripoda Shanivaram
Saripoda Shanivaram: న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. హాయ్ నాన్నవంటి క్లాసిక్ హిట్ తర్వాత నాని చేస్తున్నమాస్ సినిమా ఇది. దీంతో.. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. గతంలో నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన ‘అంటే సుందరానికి’ చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. దీంతో ఈసారి మాస్ సినిమాతో వస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. గ్యాంగ్ లీడర్ తర్వాత నాని, ప్రియాంక మోహన్ కలిసి నటిస్తున్న రెండో సినిమా ఇదే. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఎస్‌జె సూర్య కీలక పాత్రలో నటిస్తుంగా.. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆగష్టు 29న సరిపోదా శనివారంని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఫస్ట్ సింగిల్‌తో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన చిత్ర యూనిట్.. క్యాలెండర్ పేజీలను తిప్పుతూ గరం గరం సాంగ్ జూన్ 15న విడుదల చేయనున్నట్లుగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఈ సినిమా టైటిల్‌కు తగ్గట్టే.. అప్డేట్స్ను శనివారం రోజే ఇస్తుండడం విశేషం. ఇప్పుడు ఫస్ట్ సాంగ్‌ను కూడా శనివారం రోజు జూన్ 15న రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి నాని ఫ్యాన్స్ సరిపోదా శనివారం ఫస్ట్ సింగిల్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి గరం గరం సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.