జర్సీ స్పెషల్ షో సందర్భంగా నాని ఎమోషనల్ పోస్ట్ చేశారు. అభిమానుల ప్రేమాభిమానాలు చూస్తుంటే మనసు నిండిపోయింది అని రాసుకొచ్చారు. ఆయన భార్య అంజనా సైతం ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
Nani: హీరో నాని(Nani) కెరియర్లో జెర్సీ(Jersey) సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. క్రికెట్ ఆటగాడిగా నాని అద్భుతమైన నటనను కనబరిచారు. అంతే కాకుండా ఒక పిల్లాడి తండ్రిలా, సగటు భర్తగా ఎంత నేచురల్‌గా చేశారో మనకు తెలుసు. అందుకు ఆ సినిమా బాక్స్ఆఫీస్ వద్ద అంత పెద్ద హిట్ అయింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలై ఈ శుక్రవారానికి ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జెర్సీ మూవీని ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సుదర్శన్ థియేటర్లో స్పెషల్ షో వేశారు. అభిమానుల మధ్య ఆయన సతీమణి అంజనా, కుమారుడితో నాని సినిమాను చూశారు. ఈ క్రమంలో అభిమానులు ప్రేమను చూసి భావోద్వేగానికి గురయ్యారు.
తనకెంతో భావోద్వేగంగా ఉందని, అభిమానులు ప్రేమాభిమానాలు చూస్తుంటే మనసు నిండిపోయిందని, జెర్సీలోని క్యారెక్టర్ అర్జున్ మళ్లీ భూమి మీదకు వచ్చినట్టు అనిపిస్తుందని, గుండె బరువెక్కిందని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. నాని వైఫ్ అంజనా సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. జెర్సీ సినిమాను మొదటి రోజు థియేటర్లో చూసిన జ్ఞాపకాలు ఇంకా గుర్తుకు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే వాళ్ల అబ్బాయి జెర్సీ థీమ్ సాంగ్స్ కీ బోర్డులో ప్రాక్టీస్ చేస్తున్నారని, జెర్సీ చిత్రంలోని కొన్ని సీన్లు ఎన్నిసార్లు చూసిన ఎమోషనల్ అవుతాను అని రాసుకొచ్చారు. ఇక నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నారు.