»Director Harish Shankar Who Gave Warning Letter To Chhota K Naidu
Harish Shankar: చోటా కె నాయుడుకు వార్నింగ్ లేఖ రాసిన డైరెక్టర్ హరిష్ శంకర్
టాలీవుడ్లో డైరెక్టర్ హరీష్ శంకర్, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడి మధ్య వివాదం రాజేసుకుంది. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న హరీష్ శంకర్ తాజాగా ఓ వార్నింగ్ లెటర్ రాశారు. ఇకపై ఎవరి పనుల్లో వాళ్లు సరే లేదంటే నేను సిద్దంగా ఉంటాను అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Director Harish Shankar who gave warning letter to Chhota K Naidu
Harish Shankar: డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మంచి కంటెంట్‌తో మాస్ ప్రేక్షకులను ఎలా బుట్టలో వేసుకోవాలో తెలిసిన వ్యక్తి. మృదుస్వభావి యే అయినా మాటలు ధీటుగా మాట్లాడుతాడు. డైలాగ్ రైటర్ కాబట్టి మాటల్లో తూటాలు పేల్చగలడు. అప్పుడప్పుడు ఈవెంట్లలో చూస్తూనే ఉంటాము. తాజాగా ఆయనో లెటర్ రాశారు. టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడికి ఓ స్వీట్ వార్నింగ్ ఇస్తూ నన్ను కెలకొద్దు.. అంటూ రాసిన లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గౌరవనీయులైన చోటా కె నాయుడు గారికి నమస్కరిస్తూ…. రామయ్య వస్తావయ్యా సినిమా వచ్చి దాదాపు పదేళ్లు దాటాయి. ఈ కాలంలో మీరు ఓ పది ఇంటర్వ్యూలు ఇచ్చుంటే, నేను ఓ వంద ఇచ్చుంటా. ఎక్కడా కూడా మీ గురించి తప్పుగా మాట్లాడలేదు. కానీ మీరు పనిగట్టుకొని నన్ను అవమానిస్తున్నారు అనే అర్థం వచ్చేలా రాసుకొచ్చారు. ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసే పరిస్థితి వచ్చినా, మీ మీద గౌరవంతో ఆ పనిచేయలేదని, రామయ్య వస్తావయ్యకు కలిసి పనిచేశామని వెల్లడించారు. ఆ సినిమాకు ఆశించిన ఫలితం రాకపోయినా ఆ నింద మీ మీద వేయలేదు. అది నా క్యారెక్టర్ అని రాశారు. మీరు ఎన్నోసార్లు నన్ను అవమానకరంగా మాట్లాడినా మౌనంగా బాధపడ్డానే తప్పా మిమ్మల్ని ఒక్క మాట అనలేదు.
మీతో పనిచేసిన అనుభవం బాధపెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నా.. అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదు, కూడదు.. మళ్లీ కెలుక్కుంటాను అంటే ఎప్పుడైనా, ఎక్కడైనా, నేను రెడీ అంటూ హరీశ్ శంకర్ లేఖలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ లేఖ వీరి వివాదం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇంతకీ చోటా కె నాయుడు హరీష్ గురించి ఏమన్నారంటే.. రామయ్య వస్తావయ్య సినిమా చేస్తున్న సమయంలో హిరీష్ ఎవరి మాటా వినేవాడు కాదు, ఆయన ఫ్లోలో ఆయన ఉండేవారు, కనీసం నా సలహా కూడా తీసుకునేవాడు కాదు అనే విధంగా చెప్పారు.