Do you know how many people have criminal cases in AP assembly?
AP assembly: నేర చరిత్ర కలిగిన వారు చట్ట సభలకు ఎంపిక కావడం మన దేశంలో సర్వసాధారణ విషయం. ప్రతి ఏటా లోక్‌సభకు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికల్లో క్రిమినల్ కేసులు ఉన్నవాళ్లు పోటీ చేయడం, గెలవడం కూడా మనం చూస్తున్నాం. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో కూడా అదే జరిగింది. కొత్తగా శాసన సభకు ఎన్నికైన వారిలో ఏకంగా 79 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది. ఏపీ అసెంబ్లీకి కొత్తగా ఎంపిపైక ఎమ్మెల్యేలలో ఏకంగా 138 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిసింది. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ చేపట్టిన విశ్లేషణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఎంపికైన ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఈ వివరాలను వెల్లడించినట్లు తెలుస్తోంది.
గతంతో పోల్చితే క్రిమినల్ కేసులు ఉన్న వారి సంఖ్య ఈ శాసన సభలో ఎక్కువుగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. 2019లో అసెంబ్లీకి ఎన్నికైన వారిలో 96 మంది మాత్రమే క్రిమినల్ కేసులు కలిగి ఉండగా.. ఈ సారి ఆ సంఖ్య 138కి చేరింది. కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలలో నేర చరిత్ర కలిగిన వారిలో 115 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, 10 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీ నుంచి 7 మంది, వైసీపీ నుంచి 6 మంది ఉన్నారు. టీడీపీకి చెందిన చింతమనేని ప్రభాకర్‌పై అత్యధిక క్రిమినల్ కేసులు నమోదైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. దెందులూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికైన చింతమనేని ప్రభాకర్‌పై మొత్తంగా 90 కేసులు ఉన్నట్లు ADR తెలిపింది. కిడ్నాపింగ్, దొంగతనం, హత్యా ప్రయత్నం, రేప్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఆఫ్ డిమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ తెలిపింది.
BJP has highest percentage of MLAs with criminal track record following by TDP and then YSRC and lastly Janasena
115(86%) out of 134 Winning candidates from TDP, 7(88%) out of 8 Winning candidates from BJP, 6(55%) out of 11 Winning candidates from YSRCP and 10(48%) out of 21… pic.twitter.com/ANAOixcEJ0
— Sudhakar Udumula (@sudhakarudumula) June 8, 2024