గత AP ప్రభుత్వంలో ఎగ్ పఫ్ ల మీద తెచ్చిన వివాదం తాజాగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. YS జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన అధికారిక కార్యాలయంలో ఎగ్ పఫ్ ల పై భారీగా ఖర్చు పెట్టినట్టు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత 5 సంవత్సరాల్లో, ఈ ప్రభుత్వం పఫ్ ల మీద 3.62 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. దీనివల్ల ప్రతి సంవత్సరం సగటున 72 లక్షల రూపాయలు ఖర్చయినట్లు అంచనా అంటూ పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ ట్రోల్స్ చేస్తున్నాయి.
ప్రతి రోజు ముఖ్యమంత్రి కార్యాలయం 993 గుడ్డు పఫ్ లను వినియోగించుకుందని, మొత్తం 5 సంవత్సరాల్లో సగటున 18 లక్షల పఫ్ లు తిన్నారంటూ ఒక అడుగు ముందువేసి ట్రోల్స్ చేస్తున్నారు. ఈ వార్తను Telugu Desam Party (TDP) మరియు Janasena Party (JSP) పార్టీలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి.
అధికారం కోల్పోతే ఇలాంటి వార్తలు చాలా వినాల్సి వస్తుంది. గతంలో 2019లో వై ఎస్ జగన్ అధికారం చేపట్టాక చంద్రబాబు తన నివాసంలో ఎలుకలు పట్టడానికి భారీ మొత్తంలో ఖర్చు చేసారని తీవ్రస్థాయిలో అసెంబ్లీలో విమర్శలు చేసారు. ఇప్పుడు టీడీపీ వంతు వచ్చింది, వైసీపీ ని టార్గెట్ చేస్తూ ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. అధికారం వచ్చాక జగన్ సీఎం కార్యాలయం ఫుర్నిచర్ ను కూడా తన ఇంటి కోసం వాడుకున్నారని టీడీపీ లీడర్లు అన్నసంగతి తెలిసిందే