వై ఎస్ జగన్ వినుకొండ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పెంచింది. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు నెలలు పూర్తి కాకుండానే వినుకొండలో జరిగిన వైసీపీ కార్యకర్త రషీద్ హత్య రాజకీయ వర్గాల్లో పెను దుమారమే రేపింది.
షేక్ రషీద్ హత్య అనంతరం సోషల్ మీడియా వేదికగా స్పందించిన జగన్.. ఈరోజు ఉదయం వినుకొండ వచ్చి రషీద్ కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ… హత్య చేసిన జిలానీ లోకేష్ పుట్టినరోజు నాడు వినుకొండ ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తున్న ఫోటోలు చూపిస్తూ… ఇది రాజకీయ హత్యకాక ఇంకేంటి అని ప్రశ్నించారు. అలానే జిలానీ వినుకొండ ఎమ్మెల్యే తో దిగిన ఫోటోలు చూపించి ఘాటు విమర్శలు చేశారు.
ఇదే ప్రెస్ మీట్ లో ABN రిపోర్ట్రర్ అడిగిన ప్రశ్నకు జగన్ కౌంటర్ వేశారు. మీడియా సమావేశం అనంతరం సోషల్ మీడియా వేదికగా జగన్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో జరిగే అనైతిక పాలన గురించి దేశం మొత్తం, జాతీయ మీడియాకు తెలిసేలా ఢిల్లీ లో నిరసన కార్యక్రమం చేస్తాం అని చెప్పారు.
ఎన్నికల్లో ఘోర పరాభావం తరువాత జగన్ తిరిగి ప్రజల్లోకి రావడంతో వైసీపీ కార్యకర్తల్లో, జగన్ అభిమానులు జోష్ లో ఉన్నారు. ఇదే దూకుడు కొనసాగించి, ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే తిరిగి అధికారం దక్కించుకోవడం కష్టం కాదని వారు అభిప్రాయపడుతున్నారు.