SRD: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్నవిద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలని వినతి అందజేశారు. తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు మిట్టపల్లి రాధాకృష్ణ, తెలంగాణ రిటైర్డ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యక్షుడు గుండం మోహన్ రెడ్డి సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలు, విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు.

