AP: మాజీ మంత్రి జోగి రమేష్‌కు వైసీపీ అధినేత జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. జోగి రమేష్ ఇంటిపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ప్రశ్నించేవారిని భయపెట్టాలని చూడటం సరికాదని హితవు పలికారు. చంద్రబాబు రాష్ట్రంలో హింసాజ్వాలను రాజేస్తున్నారని, అవే మంటలు ఆయన సర్కార్‌ను దహిస్తాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

