KDP: టీటీడీ ఈవో అనిల్ సింఘాల్‌ను ఆకస్మికంగా బదిలీపై వైసీపీ రాష్ట్ర SEC సభ్యుడు కాశీబట్ల సత్య సాయినాథ్ శర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కల్తీ నెయ్యి ఆరోపణల్లో సిట్‌కు సహకరించి ధర్మ సంరక్షణ చేసిన అనిల్ సింఘాల్‌ను బదిలీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇందుకు పాల్పడిందని ఆయన ఆరోపించారు.

