AP: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మెజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయనను పోలీసులు రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

