AP రాజకీయాల్లో మల్లి హీట్ పెరుగుతుంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక హత్యారాజకీయాలు పెరిగిపోయాయి, లోకేష్ రెడ్ బుక్ అడ్డం పెట్టుకుని మారణహోమానికి శ్రీకారం చుట్టారని మాజీ సీఎం వై ఎస్ జగన్ చేయడం తెలిసిందే. ఒక పక్క జగన్ ఢిల్లీలో వినుకొండ హత్యకు నిరసనకు దీక్ష చేస్తుంటే, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు వైసీపీపై విమర్శలు చేస్తుంటే.. మరో వ్యక్తి సైలెంట్ గా వచ్చి అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. ఆవిడే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిళ.
షర్మిళ కోస్తా జిల్లాలో వర్షాలు సృష్టించిన బీభత్సానికి నీట మునిగిన పంటల రైతులను పరామర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా నందమూరులో షర్మిల పర్యటించారు. వరదల్లో నీట మునిగిన వారిచేలల్లోకి షర్మిళ దిగి వరద ఉదృతిని స్వయంగా చూసి స్పందించారు.
అలాగే వైసీపీ నేతల ఢిల్లీ దీక్షపై కూడా షర్మిళ స్పందించారు. హత్యా రాజకీయాలు చేసింది వైసీపీ, అధికారంలో ఉన్నంత సేపు వాటిని ప్రోత్సహించి.. సొంత బాబాయిని చంపిన వాళ్ళను పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్ మోహన్ రెడ్డి, అయినా రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే ఢిల్లీలో జగన్ కు పనేంటి? ఆయనతోపాటు ఎమ్మెల్యేలను కూడా వెళ్లనివ్వడం లేదు. ఒకవేళ జగన్ కు ధర్నా చేయాలి అనిపిస్తే ఆంధ్ర ప్రదేశ్ స్పెషల్ స్టేటస్ గురించి, వివేకా హత్య నిందితులకు శిక్షపడాలని, వరదల్లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ధర్నా చేయాలని’ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
జరుగుతున్న పరిణామాలను చూసి కొంతమంది భవిష్యత్తులో జగన్ కంటే షర్మిలనే కూటమి ప్రభుత్వానికి డేంజర్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు