»Godavari Flood Water Reached 53 Feet At Bhadrachalam
Floods : గోదావరి వరదలు.. భద్రాచలంలో అలా.. ధవళేశ్వరంలో ఇలా!
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి పొంగి పొర్లుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలం వద్ద కూడా రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
Godavari Floods : గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ధవళేశ్వరం(dhavaleswaram) బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అక్కడ గోదావరి(Godavari) నీటి మట్టం 14.9 అడుగులకు చేరుకుంది. దీంతో 14.46 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలిపెట్టారు. సీతానగరం మండలంలోని ఏటిగట్టు బలహీనంగా మారింది. ప్రమాదకరంగా ఉంది. అలాగే కొవ్వూరులోనే గోష్పాద క్షేత్రంలోకి వరద నీరు చేరింది.
కోనసీమ లంక గ్రామాలు చాలా వరకు నీట మునిగాయి. కొత్తపేట, మండపేట, రాజోలు, ముమ్మిడివరం, పి.గన్నవరం, రామచంద్రపురం నియోజకవర్గాల్లో ఉన్న లంకల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. కోనసీమలోని దాదాపుగా వెయ్యి హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లింది. లంక గ్రామాల్లోని ప్రజలు పవడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. అక్కడికి రోడ్లపై వెళ్లే పరిస్థితులు లేవు. వరదలున్న ప్రాంతాల్లో నేడు కూడా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం(Bhadrachalam) వద్ద నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. వర్షాలు కాస్త శాంతించడంతో ఎగువ నుంచి ఎక్కువగా వరద నీరు( Flood Water) రావడం తగ్గింది. దీంతో గోదావరి వరద కాస్త తగ్గుతోంది. మంగళవారం ఉదయం 51.6 అడుగులకు చేరిన నీటి మట్టం నేడు క్రమంగా తగ్గుతోంది. బుధవారం ఉదయానికి 47.3 అడుగులకు చేరుకుంది. సుమారు ఐదు అడుగుల మేర నీటి మట్టం తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది.