»Breaking Shock For Brs Another Mla Joined Congress
Breaking News : బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్లోకి చేరిన మరో ఎమ్మెల్యే
లోక్సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడి.. కాంగ్రెస్లో చేరారు. అయితే తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు.
Breaking: లోక్సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడి.. కాంగ్రెస్లో చేరారు. అయితే తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో వెంకట్రావు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిన్న తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభకు వెంకట్రావు హాజరయ్యారు.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరుఫున పోటీ చేసిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యపై విజయం సాధించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన ఏకైక సీటు భద్రాచలమే. తాజాగా వెంకట్రావు కూడా పార్టీ మారడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేదు. ఇప్పటికే పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరిన బీఆర్ఎస్.. తెల్లం వెంకట్రావు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.