»The First Victory Of Brs And Aimim Party Is Here Bhadrachalam And Amberpet
BRS, AIMIM పార్టీ తొలివిజయం ఇక్కడే
తెలంగాణలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు కోసం అనేక ప్రాంతాల్లో 1,798 టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేసి ఫలితాలను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు.
The first victory of BRS and AIMIM party is here bhadrachalam and amberpet
భద్రాచలం(bhadrachalam)లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయం సాధించారు. దీంతో రాష్ట్రంలో కేసీఆర్ పార్టీ మొదటి గెలుపు సాధించింది. ఆ తర్వాత అంబర్ పేటలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేర్ వెంకటేష్ కూడా విజయం సాధించారు. బాల్కొండలో బీఆర్ఎస్ మంత్రి ప్రశాంత్ రెడ్డి మూడు వేల ఓట్లతో గెలుపొందారు. మరోవైపు తెలంగాణలో పోటి చేసిన జనసేన పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. పోటి చేసిన 8 చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దుబ్బాకలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. బీజీపీ అభ్యర్థి రఘునందన్ రావు ఓటమి పాలయ్యారు.
నల్గొండలో కాంగ్రెస్ బోణీ కొట్టింది. బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించారు. వెంకట్ రెడ్డి 45000 వేల ఓట్లకుపైగా ఆధిక్యంలో ఉన్నారు. రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ పై రాజ్ ఠాకూర్ గెలుపు సాధించగా..ఇక చార్మినార్లో ఎంఐఎం(charminar)అభ్యర్థి విజయం సాధించగా..ఇది తొలి విజయమని చెప్పవచ్చు.
హైదరాబాద్లోని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నివాసానికి తెలంగాణ డీజీపీ అంజనీకుమార్, ఇతర పోలీసు అధికారులు చేరుకుని కలిశారు. రాష్ట్రంలోని మొత్తం 119 స్థానాల్లో కాంగ్రెస్ 65 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అధికార బీఆర్ఎస్ 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.