Congress defeated in Telangana elections 2023 Victory in Aswaraopeta and yellandu
తెలంగాణలోని కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కాంగ్రెస్ పార్టీ తొలి విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి ఆదినాారాయణ 28 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై ఘన విజయం సాధించారు. 2018లో మెచ్చా నాగేశ్వరరావు టీడీపీ నుంచి గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరగా..ఇటివల బీఆర్ఎస్ నుంచి పోటీలో దిగి ఓటమి పాలయ్యారు. మరోవైపు ఇల్లందులో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనుకయ్య విజయం సాధించారు. 38 వేల ఓట్లతో కనుకయ్య గెలుపొందడం విశేషం.