Tummala Nageswara Rao: Loan waiver is not applicable for those having salary of Rs
Tummala Nageswara Rao: అర్హులైన రైతులకు రేషన్‌కార్డు ఉన్న లేకపోయిన రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులకు రుణమాఫీ వర్తించదని తెలిపారు. ఈ నెల 18న రూ.లక్షలోపు రుణాలు మొత్తం రూ.6 వేల కోట్లకు పైగా జమ చేస్తామన్నారు. ఆగస్టు 15లోగా మిగతా రూ.లక్ష రుణమాఫీ చేస్తామని తెలిపారు. మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విధంగా ఆగస్టు 15 నాటికి రుణమాఫీని పూర్తి చేస్తామని తెలిపారు. దీనికోసం మొత్తం రూ.31 వేల కోట్ల జమ చేస్తామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఒకేసారి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాం. అందులో భాగంగా మొదటిసారి రూ.లక్ష చేస్తున్నారు. మొదటి దశలో 11.50 లక్షల మంది రైతులకు రూ.లక్ష రుణమాఫీ అవుతుంది. రెండో దఫా ఆగస్టు 15 నాటికి మరో రూ.లక్ష బ్యాంకుల్లో జమ చేస్తామని తెలిపారు. తెల్ల రేషన్‌కార్డులు లేని రైతుల వద్దకు వ్యవసాయశాఖ అధికారులు వెళ్లి పరిశీలిస్తారు. రాష్ట్రంలో మొత్తం 32 బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చాయి. నకిలీ పట్టా పాసుపుస్తకాలు పెట్టి రుణాలు తీసుకున్నవాళ్లను గుర్తించాం. రూ.లక్ష జీతం ఉన్నవాళ్లకు రుణమాఫీ కాదు. అలాంటి వారివి 17 వేల ఖాతాలున్నాయని మంత్రి తెలిపారు.