TG: ఢిల్లీ లాంటి పరిస్థితి హైదరాబాద్‌కు రాకూడదనే ఈవీ వాహనాల వినియోగం పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 200 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాటుతుందని పేర్కొన్నారు. ఈవీ వాహనాల వినియోగం దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్‌గా ఉండాలని సూచించారు. కాలుష్య పరీక్ష కేంద్రాలు HYDలోని రవాణాశాఖ కార్యాలయానికి అనుసంధానం చేశామన్నారు.