TG: BRS, కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి జరగలేదని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. ఓట్ల సవరణ ప్రక్రియ న్యాయబద్దంగా జరగట్లేదని వెల్లడించారు. గజ్వేల్లో 14 వేల ఓట్లు కొత్తగా చేరాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఓట్ల పెంపుపై జరిగిన గందరగోళం గురించి తమ దృష్టికి వచ్చిందని అన్నారు. వెంటనే సరైన నిర్ణయం తీసుకోకపోతే కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు.