అన్నమయ్య: పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో మదనపల్లె డీఎస్పీ ఎస్. మహేంద్ర ప్రైవేట్ బస్సులు, ట్రావెల్స్ యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ నెల 16వ తేదీ వరకు మాత్రమే బెంగళూరు బస్టాండ్‌లోకి ప్రైవేట్ బస్సులకు అనుమతి ఉంటుందని తెలిపారు. అనంతరం కదిరి రోడ్డులోని టిప్పు సుల్తాన్ మైదానం లేదా ప్రత్యామ్నాయ ప్రదేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు.