AP: లిక్కర్ స్కామ్ కేసులో రోణక్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. మరోవైపు రోణక్ కుమార్, అనిల్ ఛోక్రాను ఏడు రోజుల పాటు కస్టడీ కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది.