డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం వివాదంలో పడిపోయింది. పూరి జగన్నాథ్‌కు బీఆర్ఎస్ కార్యకర్తలు వార్నింగ్ ఇస్తున్నారు. అంతేకాదు.. అవసరమైతే సినిమాను అడ్టుకుంటామని అంటున్నారు.
BRS warning to Puri Jagannath for 'double Ismart' in controversy!
Double Ismart: డబుల్ ఇస్మార్ట్‌ను ఇస్మార్ట్ శంకర్‌కు మించేలా తెరకెక్కిస్తున్నాడు పూరి జగన్నాథ్. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా.. ఊరమాస్‌గా ఉంది. అయితే.. ఈ పాటలో కేసీఆర్ సార్ పాపులర్ డైలాగ్‌ను కూడా వాడుకున్నారు. ‘మార్ ముంత చోడ్ చింత’ అంటూ.. ఊరమాస్ లిరిక్స్‌తో ఈ సాంగ్ ఉంది. ఇందులో కేసీఆర్ సార్ పాపులర్ డైలాగ్ ‘ఏం చేద్దావ్ అంటావ్ మరీ’ అంటూ.. సాంగ్ మధ్యలో రెండు సార్లు ఈ డైలాగ్‌ను వాడారు. అది కూడా కేసీఆర్ ఒరిజినల్ వాయిస్‌నే వాడుకున్నారు. దీంతో.. సోషల్ మీడియాలో బిఆర్ఎస్ కార్యకర్తలు మండి పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ సార్‌ను అవమానించే విధంగా ఇలాంటి పాటలో ఎలా పెడతారు? అందులోను పాటలో తాగుడును చూపించి, తెలంగాణ వారిని కించ పరిచేలా చేశారని.. అంటున్నారు. ఈ పాట నుంచి కేసీఆర్ మాటలను తొలగించకపోతే మహిళలంతా కలిసి పూరి జగన్నాథ్ ఇంటిడిని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు.
అంతేకాదు.. సినిమాని తెలంగాణలో రిలీజ్ చేయకుండా చేస్తామని అంటున్నారు. అయితే.. ఈ విషయం మీద పూరి జగన్నాథ్ టీం స్పందించాల్సి ఉంది. ఇక ‘మార్ ముంత చోడ్ చింత’ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా.. రాహుల్ సిప్లిగంజ్, కీర్తనా శర్మ ఆలపించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ పాటలో రామ్ ఎనర్జిటిక్ డ్యాన్స్, హీరోయిన్ కావ్య థాపర్ గ్లామర్ హైలెట్‌గా నిలిచింది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసిన పూరి.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. ఆగష్టు 15న ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.