»Kalki 2898ad Kalki Director Waiting What About Salar 2
Kalki 2898AD: ‘కల్కి’ డైరెక్టర్ వెయిటింగ్.. ‘సలార్ 2’ పరిస్థితేంటి?
ప్రభాస్ లైనప్‌లో ఉన్న సినిమాల్లో 'సలార్ 2' కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అందులో కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఉన్నాడు. మరి సలార్ 2 పనులు ఎక్కడి వరకు వచ్చాయి? ప్రశాంత్ నీల్ ఏం చేస్తున్నాడు?
Kalki 2898AD: 'Kalki' director waiting.. What about 'Salar 2'?
Kalki 2898AD: ప్రస్తుతం అంతా కల్కి గురించే చర్చించుకుంటున్నారు. ఈ రికార్డ్ బద్దలు కొట్టింది.. ఆ రికార్డ్ బ్రేక్ చేసింది.. అంటూ రచ్చ చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. అయితే.. కల్కి తర్వాత ప్రభాస్ ఇమ్మీడియేట్‌గా చేయాల్సిన సినిమా సలార్ 2. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు దీని గురించి ఎలాంటి సౌండ్ లేదు. అసలు ప్రశాంత్ నీల్ ఏం చేస్తున్నాడనే విషయంలో కూడా క్లారిటీ లేదు. ఇటీవల ఆగష్టులో షూటింగ్ ఉంటుందనే వార్త బయటికి వచ్చింది.
కానీ మేకర్స్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. దీంతో.. సలార్ 2 ఇప్పట్లో ఉంటుందా? లేదా? అనేది క్లారిటీ లేకుండా పోయింది. లేటెస్ట్గా ఈ సినిమా కోసం.. తాను కూడా ఎదురు చూస్తున్నట్టుగా కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. చాలా సినీ యూనివర్స్‌లు వస్తున్నాయి, వాటిలో ప్రేక్షుకుడిగా ఏ సీక్వెల్‌పై ఎక్కువగా ఆసక్తిగా ఉన్నారని అడగ్గా.. ఖచ్చితంగా సలార్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చాడు నాగి. ఆ చిత్రంలోని కొత్త ప్రపంచం తనకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందని అన్నారు. తనకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే ఇష్టమని, సలార్ కూడా అలాగే అనిపిస్తోందని.. సలార్ స్టోరీ ఇప్పుడే మొదలైంది.. అని నాగ్ అశ్విన్ అన్నాడు.
మరి ఇంతలా వెయిట్ చేస్తున్న సలార్ 2 ఎక్కడి వరకు వచ్చింది అంటే? ఖచ్చితమైన ఆన్సర్ లేదు. అసలు ప్రశాంత్ నీల్ ముందు ఏ సినిమా స్టార్ట్ చేస్తాడనేది కూడా తెలికుండా ఉంది. ఎందుకంటే.. ఆగష్టులో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. సలార్ నిర్మాతలు కూడా వచ్చే ఏడాదిలో సలార్ 2 రిలీజ్ ఉంటుందని చెబుతున్నారు. మరి ప్రశాంత్ నీల్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.