స్టార్ డైరెక్టర్ శంకర్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ భారతీయుడు 2 సినిమాతో డిసప్పాయింట్ చేశాడు శంకర్. దీంతో ఇప్పుడు భారతీయుడు 2 రన్ టైం కూడా తగ్గించాల్సి వచ్చింది. ఇంతకీ ఎంత తగ్గించారు.
Bharateeyudu 2: Finally.. 'Bharateeyudu 2' has been cut!
Bharateeyudu 2: 28 ఏళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ అవడంతో.. ప్రేక్షకులకి అవుట్ డేటెడ్ కథగా అనిపించింది భారతీయుడు 2. దీంతో.. మిక్స్డ్ టాక్‌తోనే సరిపెట్టుకుంది భారతీయుడు 2. వసూళ్లు కూడా రోజు రోజుకి తగ్గుతునే ఉన్నాయి. మొదటి రోజు కలెక్షన్స్ పర్వాలేదు అనిపించినా.. ఆ తర్వాత మౌత్ టాక్ డివైడ్‌గా ఉండటంతో వసూళ్ల పై ఆ ఇంపాక్ట్ గట్టిగా పడింది. ఫస్ట్ వీకెండ్లో మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా.. 55 కోట్ల వరకు షేర్, 112 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు చేసిన ఈ సినిమాకు.. సోమావారం నుంచి భారీ డ్రాప్ కనిపించింది.
సింగిల్ డిజిట్‌తో సరిపెట్టుకుంటోంది. చెప్పాలంటే.. మూడు వారాలు అయిన కూడా, భారతీయుడు 2 కంటే కల్కి సినిమాకే వసూళ్లు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో.. తాజాగా ఈ సినిమా రన్ టైం తగ్గించారు. ఈ సినిమామను మూడు గంటల నిడివితో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకు వచ్చిన టాక్‌ను బట్టి.. 20 నిమిషాల రన్ టైం తగ్గిస్తారని అన్నారు. కానీ ఫైనల్‌గా.. 12 నిమిషాల వరకు ట్రిమ్ చేసి రిలీజ్ చేస్తున్నామని.. దగ్గరలో ఉన్న థియేటర్లలో ట్రిమ్ చేసిన వెర్షన్ మరోసారి చూసి ఎంజాయ్ చేయండి.. అంటూ భారతీయుడు2 చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది.
మరి.. తగ్గించిన రన్ టైం ఈ సినిమాకు కలిసి వస్తుందేమో చూడాలి. ఇక ఈ సినిమాలో సిద్ధార్త్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటించగా.. లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మించింది. అన్నట్టు.. మరో ఆరు నెలల్లో భారతీయుడు 3 సినిమాని కూడా ప్రేక్షకుల ముందు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.