»Bharateeyudu 2 Its Atrocious Did Shankar Kamal Take Bharateeyudu 2 Lightly
Bharateeyudu 2: ఇది దారుణమే.. ‘భారతీయుడు 2’ని శంకర్, కమల్ లైట్ తీసుకున్నారా?
28 ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు శంకర్, కమల్ హాసన్. కానీ ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టేసింది. దీంతో నాలుగు రోజుల్లో వసూళ్లు భారీగా పడిపోయాయి. దీంతో. శంకర్, కమల్ కూడా ఈ సినిమాను పట్టించుకోవడం లేదు.
Bharateeyudu 2: It's Atrocious.. Did Shankar, Kamal Take 'Bharateeyudu 2' Lightly?
Bharateeyudu 2: జూలై 12న రిలీజ్ అయిన ‘భారతీయుడు 2’ సినిమా.. డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. రోజు రోజుకి ఈ సినిమా కలెక్షన్స్ పడిపోతున్నాయి. మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా 26 కోట్ల షేర్ రాబట్టిన భారతీయుడు 2కి.. డివైడ్ టాక్‌తో రెండు, మూడు రోజుల్లో భారీ డ్రాప్ కనిపించింది. ఇక మండే నాటికి ఈ సినిమా వసూళ్లు దారుణంగా పడిపోయినట్టుగా చెబుతున్నారు. ఎంతలా అంటే.. మొదటి సోమవారం సింగిల్ డిజిట్‌కు పడిపోయినట్టుగా సమాచారం. నాలుగో రోజు ఇండియాలో భారతీయుడు 2కి 5 కోట్ల కలెక్షన్స్ కూడా రాలేదని అంటున్నారు.
ఇక ఫస్ట్ వీకెండ్ ముగిసే నాటికి తెలుగు రాష్ట్రాలలో 12కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. దీంతో.. తెలుగులో భారీ నష్టాలు తప్పేలా లేదంటున్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం.. నాలుగు రోజుల్లో 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని అంటున్నారు. ఇక ఈ సినిమాను ప్రేక్షకులే కాదు.. శంకర్, కమల్ హాసన్ కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే శంకర్ ‘గేమ్ చేంజర్’ కోసం హైదరాబాద్‌కి వచ్చేశాడు. అటు కమల్ హాసన్ కూడా భారతీయుడు 2 గురించి కాకుండా.. కల్కి పై స్పందించడం విశేషం. తాజాగా కల్కి హిట్ గురించి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు కమల్.
‘కల్కి’ మూవీలో సుప్రీం యాష్కిన్ అనే పాత్రలో కమల్ నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా వెయ్యి కోట్లు రాబట్టిన క్రమంలో.. స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు లోకనాయకుడు. ఇందులో.. చిత్ర యూనిట్‌ని అభినందించారు. కానీ.. రిలీజ్ తర్వాత ‘భారతీయుడు 2’ గురించి ఒక్క ట్వీట్, పోస్ట్, వీడియో గానీ పెట్టలేదు కమల్ సార్. ఈ లెక్కన.. కమల్‌కి భారతీయుడు 2 రిజల్ట్ అర్థమైపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.