ASR: మెనూ ప్రకారం విద్యార్ధులకు ఆహారం అందేలా చూడాలని అడ్డతీగల ఎంపీడీవో ఏవివి కుమార్ అన్నారు. సోమవారం అడ్డతీగల లోని జీటీడబ్ల్యూఏ (బాలికలు) పాఠశాలను సందర్శించిన సందర్భంగా ఎంపీడీవో మాట్లాడారు. పుడ్ మెటీరియల్ రికార్డులు అప్డేట్గా ఉంచుకోవాలని వార్డెన్‌కు సూచించారు. అందుతున్న ఆహారం గురించి విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు.