NRPT: కృష్ణ మండలంలోని సర్పంచ్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని కృష్ణ చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో రాయచూరు నుంచి మక్తల్‌కు వస్తున్న కారులో రూ.90 వేలు నగదు సోమవారం పట్టుబడింది. మక్తల్ చెందిన సోంపల్లి వెంకట నాయుడు వద్ద రసీదులు లేకపోవడంతో నగదును సీజ్ చేసినట్లు ఎస్సై నవీద్ తెలిపారు.