కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర సోమవారం బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా పోలీస్ స్టేషన్లో రికార్డుల నిర్వహణ, బందోబస్తు ఏర్పాట్లు, సిబ్బంది హాజరు వంటి అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.