SRD: సిర్గాపూర్ మండలం కడపల్ గ్రామానికి చెందిన బదిర సోదరులు గూడూరి ఆగమప్ప, నాగరాజు (మూగ, చెవుడు) ఇవాళ హైదరాబాదులో సీపీ సజ్జనార్‌ను కలిసారు. పెన్సిల్ ఆర్ట్‌తో వేసిన సజ్జనార్ ముఖ చిత్రం (ఫోటో ఫ్రేమ్ ) జ్ఞాపికను అందజేశారు. మాటలు రాని ఈ మూగ కళాకారుల అద్భుతమైన చిత్రకళను కమిషనర్ అభినందించి వారిని ప్రశంసించారు. ఇలాంటి కళాకారులను ప్రోత్సహించాలన్నారు.