GNTR: భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఇకపై ప్రకృతి వ్యవసాయాన్ని తప్పనిసరి బోధనాంశంగా చేర్చాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్, విజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఇది భవిష్యత్తు తరాలకు మరియు వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.