TPT: సూళ్లూరుపేట పట్టణంలో రైలు ఢీకొని ఓ వ్యక్తి గాయపడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. రాఘవయ్య పేటకు చెందిన బాబు అనే వ్యక్తి తన సెల్ ఫోన్లో మాట్లాడుతూ గేటు దాటే క్రమంలో చెన్నై నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న రైలు ఢీకొట్టింది. 108 సహాయంతో సూళ్లూరుపేట ప్రభుత్వ వైద్యా శాలకు తరలించి చికిత్స అందించారు.