AP: వందేమాతర గేయాన్ని వేడుకలా చేయడమే దేశభక్తి కాదని, ప్రభుత్వాలను జవాబుదారి చేయడమే భారతమాతకు నిజమైన సేవ చేయడమని ఎంపీ గురుమూర్తి అన్నారు. లోక్సభలో వందేమాతరంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయులందరిలో స్వాతంత్ర ప్రేరణ కల్పించిన గేయం వందేమాతరం అని, ప్రభుత్వం పౌరులందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.