TG: బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. చేవేళ్ల పార్లమెంట్ పరిధిలోని గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్ధులను సర్పంచ్‌లుగా గెలిపిస్తే ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు చొప్పున మంజూరు చేస్తానని ఎంపీ వ్యాఖ్యానించారు. ఇది ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడమేనని ఫిర్యాదులో పేర్కొంది.