KNR: శంకరపట్నం మండలంలోని సర్పంచ్ అభ్యర్థులకు ఏసీపీ మాధవి ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు. ప్రచార వాహనాలకు, సౌండ్ సిస్టమ్‌కు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు అనుమతించరని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, విజయోత్సవాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు.