SDPT: ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ విచ్చలవిడిగా ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు ఇవ్వొద్దని జిల్లా SFI అధ్యక్ష, కార్యదర్శులు అభిషేక్ భాను, రంజిత్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాలో ఇప్పటికే 6 శ్రీ చైతన్య పాఠశాలలు ఉన్నాయని మరో రెండు పాఠశాలలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.