ప్రస్తుతం ఇరాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గ్రేటర్ టోన్బ్, లెస్సర్ టోన్బ్, అబు మూసా అనే యూఏఈలోని మూడు దీవులను తమకు చెందినవిగా పేర్కొంది. అలాగే సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త యాజమాన్యంలోని దుర్రా ఆఫ్ షోర్ చమురు క్షేత్రంపై కూడా తమకు హక్కులు ఉన్నాయని తెలిపింది. అయితే ఇరాన్ వ్యాఖ్యలపై గల్ఫ్ దేశాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.