కృష్ణా జిల్లాలో కోడి పందేల ముసుగులో భారీ స్థాయిలో అక్రమ గ్యాంబ్లింగ్ కొనసాగుతోంది. గుడివాడ, కేసరపల్లి, ఈడుపుగల్లు ప్రాంతాల్లో కోడి పందేల బరుల పక్కనే గ్యాంబ్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి నిర్వాహకులు బహిరంగంగా దందా సాగిస్తున్నారు. కాయ్ రాజా కాయ్, నంబర్ గేమ్, గుండాట, వంటి ఆటలతో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ గ్యాంబ్లింగ్ వలలో చిక్కి జేబులు ఖాళీ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.