»Kalki 2898 Ad The Hunt For Kalki Records Never Stops
Kalki 2898 AD: ‘కల్కి’ రికార్డుల వేట ఆగేలా లేదు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 28988 సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన కల్కి రికార్డుల వేట ఇప్పట్లో ఆగేలా లేదు.
Kalki 2898 AD: The hunt for 'Kalki' records never stops!
Kalki 2898 AD: గత నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కల్కి 2898 ఏడి’ సినిమా.. ఫస్ట్ షో నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా.. టెక్నికల్‌గా హాలీవుడ్ రేంజ్లో ఉందనే రివ్యూస్ అందుకుంది. అందుకే.. సినిమా రిలీజ్ అయి మూడు వారాలు కావొస్తున్నా.. ఇప్పటికీ హౌస్ ఫుల్ షోస్ పడుతున్నాయి. కొత్త రికార్డులు క్రియేట్ అవుతునే ఉన్నాయి. ఇప్పటికే 1000 కోట్లు కలెక్షన్లు రాబట్టిన కల్కి.. 1100 కోట్లు కలెక్షన్ల దిశగా పరుగులు పెడుతోంది.
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లు రాబట్టిన ఏడో సినిమాగా కల్కి రికార్డ్ క్రియేట్ చేయగా.. ఆరో స్థానంలో ఉన్న షారుఖ్ ఖాన్ ‘పటాన్’ సినిమా రికార్డ్‌ను బ్రేక్ చేసేసింది. ఇక ఇప్పుడు అదే షారుఖ్ ‘జవాన్’ రికార్డుపై కన్నేసింది కల్కి. ప్రస్తుతం థియటర్లో కొత్త సినిమాలేవి లేవు. భారతీయుడు 2కి నెగెటివ్ టాక్ రావడంతో.. తెలుగుతోపాటు హిందీలోనూ ఈ సినిమాకు పోటీనే లేకుండా పోయింది. దీంతో.. ఇంకా మంచి వసూళ్లను రాబడుతోంది కల్కి. దీంతో.. జవాన్ రికార్డ్ బ్రేక్ చేయడం గ్యారెంటీ అంటున్నారు. పఠాన్ మూవీ 1050 కోట్లు రాబట్టగా.. జవాన్ 1150 కోట్లు వసూలు చేసింది.
ఎలాగు పఠాన్‌ను కల్కి క్రాస్ చేసింది కాబట్టి.. నెక్స్ట్ జవాన్ రికార్డును కూడా అధిగమించే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే.. దంగల్, బాహుబలి 2, కేజీఎఫ్2, ఆర్ఆర్ఆర్ తర్వాత ఐదో ప్లేస్‌లో కల్కి నిలవనుంది. ఇదిలా ఉంటే.. ఇదే సినిమాతో మొదలైన హైదరాబాద్ అపర్ణ సినిమాస్ మల్టీప్లెక్స్ ఏకంగా కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయగా.. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో 18 రోజులకు గాను నాలుగు కోట్ల 80 లక్షల గ్రాస్ వసూలు చేసింది. మరి.. లాంగ్ రన్లో కల్కి లెక్క ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.